అనేక మంది కొత్త జంటలు పెళ్లయిన తర్వాత కొంతకాలం పిల్లలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటారు. అయితే, పెళ్లయిన కొత్తల్లో గర్భం రాకుండా ఉండేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవడంపై అశ్రద్ధ చూపిస్తారు. ఫలితంగా కొన్ని సార్లు గర్భం వస్తుంది. మరికొన్ని సార్లు గర్భం రాకుండా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. పెళ్లైన తర్వాత కొన్ని నెలలు పిల్లలకు దూరంగా ఉండటానికి కారణాలు అనేకం ఉంటాయి. ముఖ్యంగా.. ఉద్యోగం, ఆర్థిక స్తోమత, ఉన్నత విద్యాభ్యాసం. ఆర్థికంగా సొంతకాళ్ళపై నిలబడటం, ఇలా అనేక కారణాలు చెప్పుకోవచ్చు. ఇలాంటివి ఉన్నప్పటికీ.. రతి క్రీడకు మాత్రం వారు దూరంగా ఉండలేక పోతున్నారు. కనీసం రోజుకు ఒక్కసారైనా సెక్స్‌లో పాల్గొనాలని తహతహలాడుతారు. అలాంటి సమయంలో గర్భం వచ్చే అవకాశం లేకపోలేదు.
No comments:
Post a Comment