సెక్స్ అనేది కేవలం సంతానోత్పత్తికి మాత్రమే పరిమితమై లేదు. యవ్వనంలో లైంగిక అవగాహన ఏర్పడితే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది. ఆ వికాసం వారిలో గూడుకట్టుకుని ఉన్న గుడ్డి నమ్మకాలను పారద్రోలి సక్రమ సంబంధాలు వృద్ధి చెందుతాయి. వ్యక్తిగత వికాసంతోపాటు సామాజిక ప్రగతి కూడా సాధ్యమవుతుంది. ఒక శతాబ్దం క్రితం లైంగిక విజ్ఞానం అంతగా అవసరం ఉండేది కాదు. అప్పట్లో కేవలం 14, 15 ఏళ్లకే ఆడపిల్లలకు వివాహాలు జరిగేవి. అప్పటి ఆచారాలు, వ్యవహారాలు కారణంగా దంపతులు వారాలు, నెలలపాటు ఒకరికొకరు తాకే అవకాశం కలిగేది కాదు. చాలాకాలం తర్వాతనే ఇరువురి నడుమా దాంపత్య బంధం ఏర్పడేది.
No comments:
Post a Comment